ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ మొత్తానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్, శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగా గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే. తాజాగా హసరంగా స్ధానాన్ని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం భర్తీ చేసింది.అతడి స్ధానంలో మరో శ్రీలంక యువ స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్‌ను తీసుకుంది.
రూ.50 లక్షల కనీస ధరకు ఎస్ఆర్హెచ్ అతడిని దక్కించుకుంది.కాగా ఐపీఎల్-2023 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకి నెట్‌బౌలర్‌గా విజయకాంత్ పనిచేశాడు. ఇక అతడు శ్రీలంక తరపున ఇప్పటివరకు కేవలం ఒకే టీ20 మ్యాచ్ మాత్రమే ఆడాడు. కానీ విజయకాంత్‌కు ఇంటర్నేషనల్ క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటికి.. డొమాస్టిక్ క్రికెట్లో మాత్రం మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు తన కెరీర్లో 33 టీ20లు ఆడిన విజయకాంత్ 6.76 ఏకానమీ రేటుతో 42 వికెట్లు తీశాడు.ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో సరైన మణికట్టు స్పిన్నర్లు లేరు. ఈ నేపథ్యంలో విజయకాంత్‌ను సొంతం చేసుకోవడం ఎస్ఆర్హెచ్ కలిసిశ్చే ఆంశం.