ఈరోజు పరిస్థితి చూస్తుంటే దొంగలు పోయి…గజదొంగలు వచ్చినట్లుంది : కిషన్ రెడ్డి

-

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశంలో ఉగ్రవాదులను ఏరి వేయాలన్నా.. శత్రు దేశాలకు బుద్ధి చెప్పాలన్నా ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమని కిషన్ రెడ్డి అన్నారు. మోడీ హయాంలో అన్ని మతాలకు మేలు జరిగిందని అన్నారు . తెలంగాణను 10 సంవత్సరాల పాటు కేసీఆర్ కుటుంబం తమ స్వార్థం కోసం వాడుకుందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

కేసీఆర్ పది సంవత్సరాల పాటు తన కొడుకు, కూతురు, అల్లుడు, ఫామ్ హౌస్ గురించి మాత్రమే ఆలోచించాడని… కానీ తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించలేదని విమర్శించారు. అయితే ఈ రోజు పరిస్థితి చూస్తుంటే దొంగలు పోయి.. గజదొంగలు వచ్చినట్లుందని కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి వేటినీ నెరవేర్చడం లేదన్నారు. డిసెంబర్ 9వ తేదీ నాడు రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ దానిని మరిచిపోయారని విమర్శించారు. రాహుల్ గాంధీకి అయితే ఇవేమీ తెలియదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news