హీరో బాలకృష్ణ దాదాపు 16 ఏళ్ల క్రితం తొలి సారి దర్శకత్వం వహించి నటించిన చిత్రం `నర్తనశాల`. బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రాన్ని ప్రారంభించాడు. భారీగా ఓపెనింగ్ జరిగింది. దీనిపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. కొంత షూటింగ్ కూడా చేశారు. ద్రౌపది పాత్రలో నటించిన సౌందర్య అకాల మరణంతో ఈ చిత్రాన్ని అర్థాంతరంగా ఆపేశారు. ఆ తరువాత దీన్ని మళ్లీ స్టార్ట్ చేయాలనే ప్రయత్నాలేవీ జరగలేదు. అయితే ఈ మూవీ కోసం చిత్రీకరించిన సన్నివేవాల్ని చూడాలనే కుతూహలం బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో వుండేది. దాదాపు పదహారేళ్ల క్రితం నాటి ఫుటేజీని ప్రేక్షకులకు చూపించాలన్న ఆలోచనతో ఆ ఫుటేజీ స్ట్రీమింగ్ హక్కుల్ని శ్రేయాస్ ఈటీ దక్కించుకుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల నిడివిగల సన్నివేశాల్ని చూపిస్తున్నామని బాలయ్య చెప్పారు కానీ అసలు చిత్రీకరించిన ఫుటేజీ వుందే తొమ్మిది నిమిషాలట. అయినా బాలయ్య దర్శకుడిగా తన ప్రతిభని చూపించే ప్రయత్నం చేశారు. ఈ గింప్స్ చూసిన ఆడియన్స్, అభిమానులు బాలకృష్ణ `నర్తనశాల`ని పూర్తి చేసి డిలీజ్ చేయాల్సిందే అని డిమాండ్ చేయడంగ్యారెంటీ అంత బాగా బాలకృష్ణ ఆ సన్నివేశాలని చిత్రీకరించారట.
ఈ తొమ్మిది నిమిషాల ఫుటేజీకి ఎన్టీఆర్ నటించిన నాటి `నర్తనశాల`లోని ఓ పాటని జత చేశారు. `నరవరా ఓ గురువరా` అంటూ సాగే పాటని కలిపారు. అంతే కాకుండా బాలయ్య బృహన్నల గెటప్‌లో నటించిన `టాప్ హీరో` చిత్రంలో ని క్లిప్‌ని కూడా వాడారు. దీంతో కొంత వరకు అసంపూర్తిగా వున్న ఫుటేజీకి అదనపు ఆకర్షణగా ఈ సన్నివేశాలు నిలిచాయి. విమర్శల్ని పక్కన పెడితే బాలయ్య అభిమానులకు `నర్తనశాల` గ్లింప్స్ ఓ పండగే.