తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది బడా హీరోల మైనపు విగ్రహాలు లండన్, సింగపూర్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరాయి. ఇప్పటికే ప్రభాస్, మహేశ్ బాబు,అల్లు అర్జున్ వంటి బడా స్టార్స్ మైనపు విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేశారు.
తాజాగా ఈ అరుదైన గౌరవం మెగా తనయుడు రాంచరణ్‌కు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన, ప్రతీభాశీలుల మైనపు బొమ్మలను లండన్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తారు. తాజాగా గ్లోబర్ స్టార్ అయిన హీరో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మేడం టుస్సాడ్స్ మ్యూజియం నిర్వహకులు తెలిపారు. గతంలోనే ఈ ప్రకటన రాగా.. ఈ మే 9న విగ్రహాన్ని లాంచ్ చేయనున్నారు. అనంతరం ఆ మైనపు విగ్రహాన్ని సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలించనున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.