మేడ్చల్ బీఆర్ఎస్ శాసనసభ్యులు, మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి తెలంగాణ ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదనుకుంట.. ఆయన చదువుకున్నది తక్కువే అని వేలకోట్లకు అధిపతి. గత బీఆర్ఎస్ హయాంలో ఆయన రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం గులాబీ పార్టీ అధికారానికి దూరమైంది. దీంతో ఆయనలో కాస్త ఉత్సాహం తగ్గింది.
అయితే, గత ఏడాదిన్నరగా సైలెంట్‌గా ఉన్న మాజీ మంత్రి.. నేడు బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా మరోసారి స్టెప్పులేశారు. శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద నాయకులతో కలిసి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి చేశారు. వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లేందుకు అలియాబాద్ చౌరస్తా వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్బంగా డప్పుసప్పుళ్ల నడుమ ఓ మహిళతో కలిసి ఆయన ధూంధాం స్టెప్పులు వేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
స్టెప్పులేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి
బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా వద్ద నాయకులతో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సందడి
వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవసభకు వెళ్లేందుకు అలియాబాద్ చౌరస్తా వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న పార్టీ నాయకులు,… pic.twitter.com/Uq5Kh9YZcC
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2025