తిరుపతి జిల్లాలో అసాంఘిక కార్యాకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డ్రోన్ నిఘాతో పోలీసులు వేటాడుతున్నారు. తాజాగా జిల్లాలోని బాకరాపేట సర్కిల్ వైవీపాలెం పోలీసుస్టేషన్ పరిధిలోని నాటుసారా స్థావరాలపై అధునాతన డ్రోన్స్‌తో దాడులు చేపట్టారు. రహస్యంగా చెట్టు తోర్రలో దాచిన నాటు సారాను డ్రోన్ కెమెరా ద్వారా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
వైవీపాలెం మండలం వేములవాడ గ్రామం, తలకోన వాటర్ కెనాల్ సమీపంలో గుట్టుచప్పుకాకుండా చెట్టుతొర్రనులో దాచిన 9 లీటర్ల నాటు సారాయిని పోలీసులు పట్టుకున్నారని .. చెట్టు తోర్రలో.. భూ గర్భంలో సారాయి దాచి రహస్యంగా తప్పించుకు పారిపోతున్న వేముల హనుమంతు, ఎస్ మునిస్వామిని డ్రోన్ కెమెరా ద్వారా స్ధానిక పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు రౌండప్ వేసి పట్టుకున్నారన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ డ్రోన్ కెమెరాతో గాలించి పట్టుకుంటామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు.