రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు నిందితుడి ఆచూకి తెలిపిన వారికి రూ.10లక్షల రివార్డు

-

బెంగళూరు పట్టణంలోని రామేశ్వరం కేఫ్  లో సంభవించిన బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ఎన్ఐఏ జెట్ స్పీడ్లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థ ఇవాళ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు నిందితుడి ఫొటోలను ఎస్ఐఏ అధికారులు విడుదల చేశారు. ఒకవేళ ఎవరైనా నిందితుడిని పట్టించినా, ఆచూకీ తెలిపినా వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ఇస్తామని వెల్లడించారు ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. నిందితుడి ఆచూకి చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వెల్లడించింది ఎన్ఐఏ. 

మార్చి 1న రామేశ్వరం కేఫ్ లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పేలుడును సీరియస్ గా తీసుకున్న కేంద్ర హోంశాఖ కేసును NIA కు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.కేఫ్ లో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కదలికలను బట్టి ఎస్ఐఏ బృందం దర్యాప్తును ప్రారంభించింది. పేలుడులో ఆర్డీఎక్స్ వాడారని బాంబ్ ఎక్స్ప్లోజివ్ నిపుణులు వెల్లడించారు. కేసులో ఇప్పటి వరకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

కేఫ్ లో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న సంచిని అక్కడపెట్టి హడావుడిగా వెళ్లిన నిందితుడి సీసీ కెమెరా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఇందుకోసం 5 కి.మీ పరిధిలోని 300 సీసీ కెమెరాల చిత్రాలను విశ్లేషించారు. తెల్ల టోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్కు కట్టుకుని నల్లబూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. టైమర్ బాంబు సంచి ఉంచే వేళ చేతికి గ్లవ్స్ ధరించి ఉన్నట్లుగా గుర్తించారు. అతడిని ప్రధాని అనుమానితుడిగా గుర్తించిన ఎస్ఐఏ అధికారులు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డును అందజేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news