ఒక పక్క దేశం కరోనాతో నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో భూకంపాలు కంగారు పెడుతున్నాయి. ప్రతీ రోజు ఏదోక రాష్ట్రంలో భూకంపం వస్తూనే ఉంది. చిన్న చిన్న భూకంపాలె అయినా సరే అసలు పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు. నిన్న ఓడిశాలో భూకంపం వచ్చింది. 3. 5 తీవ్రతతో వచ్చింది. నేడు అసోం లో వచ్చింది. అది 3.5 తోనే వచ్చింది. జమ్మూ కాశ్మీర్ లో వచ్చింది అది 4 వరకు ఉంది రిక్టర్ స్కేలు పై.
ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రం అసోం లో అయితే పరిస్థితి కాస్త కంగారు పెడుతుంది. ఆ రాష్ట్రంలోని సోనిత్ పూర్ జిల్లాలో నేడు భూకంపం వచ్చింది. తీవ్రత తక్కువగానే ఉంది. అయినా సరే ఇలా ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట వస్తుంది. దీనిపై ఆందోళన వ్యక్తమవుతుంది. అటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా వరుస భూకంపాలు వస్తున్నాయి. లడఖ్ సహా కొన్ని ప్రాంతాల్లో భూకంపాల తీవ్రత ఎక్కువగానే ఉంది.