కేరళ విమాన ప్రమాదం కి సంబంధించి ఇప్పుడు పౌర విమానయాన శాఖ సీరియస్ గా ఉందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. విమాన ప్రమాదం జరగడానికి ఏవియేషన్ అధికారులే కారణమా…? అంటే అవుననే సమాధానం వస్తుంది. వర్షం పడుతుంది, అక్కడ వాతావరణం అనుకూలించడం లేదు. విజిబిలిటీ కూడా అసలు ఏ మాత్రం క్లియర్ గా లేదు.
ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కనపడటం లేదు. రన్ వే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయినా సరే అనుమతి ఇచ్చారు ఏవియేషన్ అధికారులు. దీనితోనే ఈ ప్రమాదం జరిగింది అని పౌర విమానాయాన శాఖ భావిస్తుంది. కచ్చితంగా ఏవియేషన్ అధికారులు చేసిన పెద్ద తప్పు కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనే అసహనం వ్యక్తం చేస్తుంది. దీనిపై ఇప్పుడు విచారణ ముమ్మరం చేసారు. కచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.