బీఆర్ఎస్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దానం నాగేందర్ కామెంట్స్.. ఆయన అన్నది నిజమేనా..

-

పదేళ్ల పాటు తెలంగాణలో అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ కు ఇప్పుడిప్పుడే ప్రతిపక్షంలో రాజకీయాలు ఎలా ఉంటాయో అర్దమవుతోంది.. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కేసీఆర్ గతకొద్దిరోజులుగా సైలెంట్ మోడ్ లో ఉన్నారు..దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు పార్టీ బాధ్యతలు మోస్తున్నారు.. ఇదే సమయంలో బిఆర్ ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి.. తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.. దీంతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది..

తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదినెలలు కావొస్తోంది.. ప్రజల్లో ఉండే వ్యతిరేకతను బిఆర్ఎస్ క్యాష్‌ చేసుకోలేకపోతోంది.. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా బిఆర్ఎస్ కు గ్రాప్ పెరిగిన పరిస్థితి కనిపించడంలేదు.. ఎమ్మెల్యేలు చేజారిపోతూ ఉండటంతో క్యాడర్లో కూడా నిస్తేజం అలుముకుంది.. పార్టీ కార్యక్రమాలు ఎక్కడా కనిపించడంలేదు.. మీడియాకు ముందు ప్రెస్ మీట్ లు పెట్టే నేతలు నియోకజవర్గాల్లో తిరగడం లేదు.. దీంతో పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోందన్న ప్రచారం జరుగుతోంది..

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలంటూ బిఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది..దీనిపై కోర్టు కూడా స్పష్టమైన డైరెక్షన్స్ ఇచ్చింది. దీనిపై స్పీకర్ స్పందించాలంటూ తీర్పునిచ్చింది.. ఈ క్రమంలో పార్టీ మారాలని భావిస్తున్న కొందరు బిఆర్ఎస్ నేతలు వెనకడుగు వేశారు.. దీంతో చేరికలకు కాస్త బ్రేక్ పడింది.. ఈ విషయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు బిఆర్ఎస్ కు నిద్రపట్టనివ్వడంలేదు..

హైకోర్టులో నడుస్తున్న కేసుని బూచిగా చూపించి పార్టీ మారకుండా బిఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.. కాంగ్రెస్ లో చేరడం కొంత లేట్ అవుతుందేమో గానీ.. బిఆర్ఎస్ కు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడం మాత్రం పక్కా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బిఆర్ఎస్ లో తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి.. పార్టీ మారే ఎమ్మెల్యేలు ఇంకా ఎంత మంది ఉన్నారనే ప్రశ్న పార్టీ నేతలకు చెమటలు పట్టిస్తోందట.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది..దీంతో బిఆర్ఎస్ ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version