కర్నూలు జిల్లాలో వింత ఆచారం తెరపైకి వచ్చింది. మగవారు మగువలగా మారి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామంలో మాత్రం ఈ హొలీ పండుగను విచిత్ర వేష ధారణలతో మగవారు ఆడవారి వేషధారణలో అలంకరించుకొని రతి మన్మధులకు పూజలు జరుపుకోని మొక్కులు తీర్చడం.. ఇక్కడ వారి సంప్రదాయం.
కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుల్లూరు గ్రామంలో హొలీ పండగ వచ్చిందంటే ఆ గ్రామంలో ఈ హొలీ పండుగ రోజు మగవాళ్ళు చీర కట్టుకొని, బంగారు ఆభరణాలు వేసుకొని ముస్తాబవుతారు. ఇది వారి తాత, ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం. అనుకున్న కోరికలు తీరితే మగవారు ఆడవాళ్ల మాదిరి ముస్తాబై పిండి వంటలు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి “రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు.