ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్‌ రెండో ఉత్తర్వులు..!

-

దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.అయితే జైలు నుంచే పాలన సాగిస్తానని చెప్పిన కేజ్రీవాల్ ఇటీవలే ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్ మంత్రి ఆతిశీ తెలిపారు. ఈ క్రమంలో కస్టడీ నుంచి ఆయన ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. అయితే ఆ విషయం తేలకముందే తాజాగా సీఎం కేజ్రీవాల్ మరోసారి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

మంగళవారం ఉదయం లాకప్‌ నుంచి కేజ్రీవాల్‌ రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్‌ వర్గాలు తెలిపాయి. ఈసారి ఆరోగ్యశాఖకు సంబంధించినవి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన నీటి సమస్య నివారణ కోసం సహచర మంత్రి ఆతిశీకి నోట్‌ ద్వారా ఉత్తర్వులివ్వగా.. దీన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్‌ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనే పనిలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి ఆతిశీని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news