గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్ : బాధితురాలిపై అనుమానాలు !

గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన విచారణ ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ కేసు లో బాధిత మహిళ మెడికల్ రిపోర్ట్ కీలకంగా మారింది. మెడికల్ రిపోర్ట్ నమూనాల పరీక్షల్లో మత్తు ప్రయోగం లేని ఆనవాళ్లు బయట పడ్డట్లు వైద్యులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం అందుతోంది. మెడికల్ రిపోర్ట్ నమూనాల పరీక్షల్లో మత్తు ప్రయోగం లేని ఆనవాళ్లు లేక పోవడం తో పోలీసులు.. బాధిత మహిళపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిందితులు తనకు క్లోరోఫాం, మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో బాధితురాలు నుంచి రక్తంతో సహా వివిధ నమూనాలను సేకరించిన ఫోరెన్సిక్‌.. వీటి ఫలితాల్లో క్లోరోఫాం సహా ఇతరాల ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులకు రిపోర్ట్ అందినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమ మహేశ్వర్ తో పాటు ముగ్గురు సెక్యూరిటీ గార్డులు పోలీసుల అదుపులో ఉన్నారు.