ఓటు Ak 47 కంటే విలువైనది – ఈటెల రాజేందర్

-

ఓటు ప్రజల తలరాతను మారుస్తుందని.. ఓటు ఏకే 47 కంటే విలువైనదని అన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. శనివారం మునుగోడు నియోజకవర్గం లోని చౌటుప్పల్ మండలంలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఓటు ప్రజల తలరాతను మారుస్తుందని.. ఓటును అమ్ముకోవద్దంటూ ప్రజలను కోరారు. హుజురాబాద్, దుబ్బాక ప్రజల పేరిట వెలసిన పోస్టర్లు బూటకమని అన్నారు.

తనను గెలిపించిన ప్రజలు బాధపడడం లేదని తెలిపారు ఈటెల రాజేందర్. తెలంగాణ ఉద్యమ సమయంలో అత్యధికంగా ప్రాణ త్యాగం చేసింది మునుగోడు బిడ్డలేనని అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే భూస్వాములకు రైతుబంధు బంద్ చేస్తామని.. కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. మునుగోడు ప్రజలు హుజరాబాద్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారని వివరించారు. ఆత్మగౌరవం గల వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని.. బిజెపి వస్తేనే తెలంగాణ ప్రజలలో మార్పు వస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version