“అహింస” నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ !

-

టాలీవుడ్ సూపర్ హిట్ ప్రొడ్యూసర్, ఎస్పీ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు రెండో తనయుడు అభిరామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తేజ దర్శకత్వంలో అహింస మూవీతో అభి టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో గీతికా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పీ కిర‌ణ్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన అభిరామ్ స్ట‌న్నింగ్ లుక్, టీజ‌ర్‌ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. జ‌యం సినిమాతో తేజ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన స‌దా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. నటుడు, దర్శకుడు సముద్రఖని విలన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

హీరో, హీరోయిన్ ఒకరి పట్ల ఒకరి తమ ప్రేమను వెల్లడి చేసే ప్రయత్నంగా ఈ పాట వస్తుంది. ఆర్పి పట్నాయక్ అందించిన బాని కొత్తగా అనిపిస్తుంది. చంద్ర బోస్ సాహిత్యం అందించిన ఈ పాటని కాలభైరవ – కీర్తన శ్రీనివాస ఆలపించారు. ఓ గ్రామీణ ప్రాంత నేపథ్యంలోని లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version