బేగంపేటలో బండి సంజయ్,కిషన్ రెడ్డిలకు ఘన స్వాగతం

-

తెలంగాణలో బీజేపీని అన్ని వర్గాలు ఆదరించాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని 35 శాతానికి పెంచి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ తెలంగాణ తరఫున సెల్యూట్ చేస్తున్నానని కిషన్ రెడ్డి చెప్పారు.

కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇవాళ తొలిసారి రాష్ట్రానికి వచ్చిన కిషన్‌రెడ్డికి బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా నేతలు ఆయనకు హారతులు ఇచ్చి వీరతిలకం దిద్దారు. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో నిర్వహించిన ర్యాలీలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు బీజేపీ ముఖ్య నేతలు నాంపల్లి బీజేపీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరగా దారిపొడవునా ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రసూల్‌పుర, ప్యారడైజ్, రాణిగంజ్, కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ, హిమాయత్‌నగర్ మీదుగా బీజేపీ స్టేట్ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగనున్నది. పార్టీ ఆఫీస్‌లో కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version