దొంగతనం చేసిన సొమ్ముతో వృద్ధులకు దుప్పట్లు పంచిన యువకుడు..! వీడియో వైరల్‌..!

-

దొంగలంటే..ఒకప్పుడు మూర్ఖంగా ఉండేవాళ్లు.. పెద్ద పెద్ద మీసాలు వేసుకుని వాళ్ల మొఖం చూస్తేనే వీళ్లు దొంగలు అని రాసిపెట్టి ఉంటుందేమో అన్నట్లు ఉంటారు..కానీ కాలం మారేకొద్ది దొంగలు కూడా అప్డేడ్‌ అయ్యారు. తెలివితేటలు పెరిగాయి.. స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. దొంగతనాలు పెద్ద పెద్ద స్కెచ్‌లు వేసి ఎవరికీ దొరకకుండా దొంగతనం చేస్తున్నారు. కష్టపడి ఇంట్లోకి వెళ్లాక ఆ ఇంట్లో ఏం లేకపోతే.. ఫ్రస్టేట్‌ అయ్యి లెటర్లు కూడా రాసి మరీ వస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో మనం చాలా చూశాం.. అయితే ఈ దొంగ అలా కాదు.. చాలా మంచోడు. దోచుకున్నది దాచుకోకుండా దానం చేస్తున్నాడు. వీధుల్లో ఉండే వారికి బెడ్‌షీట్లు కొని పంచిపెట్టాడట.. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఓ ఇంట్లో ఇటీవ‌లే రూ. 10 వేల దొంగ‌త‌నం జ‌రిగింది. బాధిత వ్య‌క్తి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు.. దొంగతనం ఆరోపణపై ఒక యువకుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వైరల్‌ అవుతున్న వీడియోలో.. పోలీస్ స్టేషన్‌లో నిలబడి ఉన్న దొంగను డ‌బ్బుల‌ను ఎందుకు దొంగిలించావు అని పోలీసుల సమక్షంలో దుర్గ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డా. అభిషేక్ ప్రశ్నించారు. దొంగతనం చేసిన డబ్బులతో ఏం చేశావ్ అని అడుగగా.. ఒక గొప్ప ప‌ని కోసం అని ఆ దొంగ చెప్పాడు. దీంతో అక్క‌డున్న పోలీసులంతా గ‌ట్టిగా న‌వ్వారు.. చ‌లి తీవ్రంగా ఉండ‌టంతో వీధుల్లో ఉండే వృద్ధులు, కుక్క‌లు, ఆవుల‌కు దొంగిలించిన డ‌బ్బుతో బెడ్‌షీట్లు కొని ఇచ్చాన‌ని ఆ దొంగ చెప్పుకొచ్చాడు.
అత‌ను చేసిన పనికి పోలీసులు ఫ్లాట్‌ అయ్యారు. మ‌రి వారి నుంచి నీకు ఆశీర్వాదం ల‌భించిందా అని పోలీసులు అడ‌గ్గా.. ఆశీర్వాదం తీసుకున్నాను స‌ర్ అని దొంగ తెలిపాడు. ఈ వీడియో ట్విట్టర్ అకౌంట్లో డిసెంబర్ 2న పోస్ట్‌ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, కామెంట్స్ వస్తున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అతను చేసిన పని మంచిదంటారా.?

Read more RELATED
Recommended to you

Latest news