వామ్మో..ఏకంగా గాలినే అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్న యువకుడు..

-

మన ప్రకృతిలో ప్రతి వస్తువు చాలా విలువైనది.ఇప్పుడు కొన్ని వస్తువులు ఊరికే వస్తున్నాయి కదా అని విరివిగా వాడుతున్నారు. ఫ్రీగా వస్తున్నాయి కదా అని అవసరానికి మించి వాడితే తర్వాత కొరత తో బాధ పడాల్సి వస్తుంది. ఉదాహరణకు ఉచితంగా లభించే నీళ్లు ఇప్పుడు చాలా ఖరీదైపోయాయి. డబ్బులు పెడితే గానీ సురక్షితమైన తాగు నీరు లభించని పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి.

ఈ క్రమంలోనే మానవులకు అత్యంత ఆవశ్యకమైన గాలి కూడా ఖరీదైపోతోంది. కాలుష్యం కారణంగా స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోయింది. దీంతో కొలంబియాకు చెందిన ఓ యువకుడు ఎవరూ ఊహించని ఓ కొత్త రకం వ్యాపారానికి తెర తీశాడు. కంటికి కనిపించని గాలిని బాటిళ్లలో నింపి అమ్మేస్తున్నాడు. ఫ్రీగా దొరికే గాలిని అమ్మి డబ్బులు పోగేసుకుంటున్నాడు. కొలంబియాలోని మెడలిన్‌ ప్రాంతం అద్భుతమైన వాతావరణానికి పేరు..దాన్ని సొమ్ము చేసుకోవాలని వినూత్న ఆలోచన చేశాడు..

జూవాన్‌ కార్లోస్‌ అల్వరాడో. ఇక్కడి సహజమైన, నాణ్యమైన గాలిని ఆస్వాదించండి అంటూ గాలి నింపిన బాటిళ్లను పర్యాటకులకు విక్రయించడం స్టార్ట్ చేశాడు. తన గాలి బాటిళ్లకు ‘మెడలిన్‌ ఎయిర్‌’ అని బ్రాండ్‌ నేమ్‌ కూడా పెట్టేశాడు. బాటిళ్ల లో గాలి ఏంటి అంటూ అనేకమంది కామెంట్ చేసినా కూడా వాటిని లెక్క చెయ్యకుండా ముందుకు సాగాడు. బాటిళ్లలో గాలిని నింపడం అంత ఈజీ కాదని, అందుకోసం తాను ఒక ప్రత్యేక పరికరాన్ని కూడా తయారు చేశానని చెప్పుకొచ్చాడు. గాలిని శుద్ధి చేసి, ఒక బాటిల్ నింపడానికి అర్ధ గంట సమయం పడుతుందని చెబుతున్నాడు. ఒక్కో బాటిల్ ను ఐదు డాలర్లకు అంటే సుమారు 400 రూపాయలకు అమ్మతున్నాడు.. మొత్తానికి సక్సెస్ అయ్యి అందరికి ఆదర్సంగా నిలిచాడు.. చిన్న ఆలోచన ఉంటే ఏదైనా సాధించవచ్చునని మరోసారి రుజువు అయ్యింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version