గత నెల 2వ తారీఖున గుజరాత్ లో ఓ 19 ఏళ్ల యువతి అదృశ్యం అయింది. ఆ రోజు ఎంతకీ తమ కూతురు ఇంటికి రాకపోవడంతో ఆ బాధితురాలి తల్లిదండ్రులు వారి శాయశక్తుల యువతి ని వెతకడానికి ప్రయత్నించారు. వారికి కూతురు లభించకపోవడంతో ఇక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే అందులో వారి ఇంటి పక్కనే ఉన్న షోవంజీ ఠాకూర్ అనే వ్యక్తి వారి కుమార్తెను తీసుకవెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో సదరు బాలిక 18 ఏళ్ళు నిండి మేజర్ అవ్వడంతో వారు కేసు నమోదు చేయలేకపోయారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
తమ కుమార్తెను ఓ వృద్ధుడు తీసుకు వెళ్ళాడని ఆ విషయాన్ని పోలీసులకు తెలిపిన వారు కంప్లైంట్ తీసుకోవడం లేదని కేసు వేశారు. అయితే ఇందుకు సంబంధించిన విషయాలు జూన్ 22న హైకోర్టు విచారించింది. జూన్ 29 లోగా యువతి ఆచూకీ కనుగొని కోర్టు ముందు హాజరు పర్చాలని ఆదేశించారు. ఇదే క్రమంలో మళ్లీ పిటిషన్ విచారణకు రాగా పోలీసులు యువతి ఆచూకీ ఇంకా లభించలేదని, ఆమె కోసం గాలిస్తున్నామని తెలియజేశారు. మళ్లీ జూలై 13 లోపు ఆమెను కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. ఇక ఆ వృద్ధుడి విషయం చూస్తే… అతనికి ఓ కూతురు ఉండి వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి వయసులో ఆయన ఓ అమ్మాయిని తీసుకెళ్ళి పోవడం సరికాదని పిటిషనర్ తెలిపారు.