పిల్లల ఆధార్ కార్డు నీలం రంగులో ఉంటుంది. దీనిని బాల్ ఆధార్ కార్డ్ అని అంటారు. పిల్లల తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు సంఖ్య లింక్ చేయబడుతుంది. దీనిలో తల్లిదండ్రుల మొబైల్ నంబర్ కూడా నమోదు చేస్తారు. మీరు మీ దగ్గర్లోని పోస్టాఫీసు, బ్యాంక్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళితే ఆధార్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అలానే మీరు దీని కోసం ఒక ఫారమ్ నింపాలి మరియు తల్లిదండ్రుల ఆధార్ సంఖ్య కూడా నమోదు చేయాలి. తరువాత పిల్లల బయోమెట్రిక్ రికార్డ్ నమోదు చేస్తారు. 90 రోజుల్లోపు ఆధార్ వచ్చేస్తుంది. అలానే మీరు మీ పిల్లల ఆధార్ కార్డు తీసుకుంటే 5, 15 సంవత్సరాల వయస్సులో దాన్ని అప్‌డేట్ తప్పకుండ చెయ్యాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి.
UIDAI ప్రకారం 5 సంవత్సరాల వయస్సులో వాళ్ళకి, 15 సంవత్సరాల వయస్సు వాళ్ళకి కూడా బయోమెట్రిక్ వివరాలను నవీకరించాలి. ఎందుకు అంటే..? 5 సంవత్సరాల ముందు ఆధార్ కార్డు వున్న పిల్లలకి వేలిముద్రలు, కళ్ళు అభివృద్ధి ఉండదు అందువల్ల చిన్న పిల్లల నమోదు సమయంలో వారి బయోమెట్రిక్ వివరాలు తీసుకోబడవు.
కనుక ఐదు దాటితే దీనిని మార్చుకోవడం ముఖ్యం. అదే విధంగా 15 సంవత్సరాల వయస్సు లో బయోమెట్రిక్ వివరాలను నవీకరించడం అవసరం. బయోమెట్రిక్ వివరాలను నవీకరించడం పూర్తిగా ఉచితం. ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా వారి పిల్లల ఆధార్ కార్డులోని బయోమెట్రిక్ వివరాలను నవీకరించవచ్చు.