మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ ఎన్నో వాటికి అవసరం. స్కీమ్స్ ఓపెన్ చేయడం మొదలు ఎన్నింటికో అవసరం అవుతుంది. భారతీయ పౌరులు ఎవరైనా ఉచితంగా ఆధార్ కార్డు ని తీసుకోవచ్చు.
అయితే కేవలం పెద్దలకే కాక పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ కార్డు ని పొందొచ్చు. మరి ఇక పూర్తి వివరాలను చూస్తే.. అప్పుడే పుట్టిన పిల్లలకు బాల ఆధార్ కార్డు వుంది. తల్లిదండ్రుల ఆధార్ కార్డుల ప్రూఫ్ తో దీనిని పొందొచ్చు. ఇలా వారికీ ఆధార్ ని జారీ చేస్తారు.
పిల్లల ఆధార్ కార్డు కి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మీడియా నివేదికల ప్రకారం చూస్తే.. రాబోయే కొన్ని నెలల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పుట్టిన పిల్లలకి ఆధార్ ని ఇస్తారట. బర్త్ సర్టిఫికెట్‌తో పాటుగా ఆధార్ కార్డుని పొందచ్చట. ఒకవేళ కనుక రాబోయే కొన్ని నెలల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పుట్టిన పిల్లలకి ఆధార్ వస్తున్నట్టయితే దేశంలో అప్పుడే పుట్టిన పిల్లలందరికీ ఆధార్ వచ్చేస్తుంది బర్త్ సర్టిఫికెట్ లాగే.