బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన ప్రేమను అధికారికంగా బయట ప్రపంచానికి వెల్లడించింది. ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ప్రేమలో ఉన్నానని.. పెళ్లి చేసుకుంటానని తెలిపింది. అమీర్ ఖాన్ కు నుపూర్ శిఖారే పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్నాడు. అతను గత కొన్నేళ్ల నుండి అమీర్ వద్ద పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల సైక్లింగ్ పోటీలలో పాల్గొనేందుకు నుపూర్ విదేశాలకు వెళ్ళగా ఐరా సైతం ఆయనకు తోడుగా వెళ్ళింది.
పోటీలు ముగిసిన వెంటనే.. ఐరా వద్దకు చేరుకొని ఆమెను హత్తుకుని నుపూర్ ముద్దాడాడు. అనంతరం మోకాలి పై కూర్చుని ఉంగరంతో ప్రపోజ్ చేశాడు. దీనికి ఐరా నవ్వుతూ ఓకే చెప్పింది. ఈ వీడియోని ప్రస్తుతం ఐరా ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ.. నేను ఎస్ చెప్పాను అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు 2020 నుంచే ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని వారు తాజాగా అధికారికంగా వెల్లడించారు.