సీఎం జగన్ కి పేర్లు మార్చడం పై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని మండిపడ్డారు మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. జగన్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు మరిచారని అన్నారు. మధ్య నిషేధమని మహిళలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్కడ చూసినా భూకబ్జాలు, అరాచకాలే అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సీఎం జగన్ రివర్స్ పాలన చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదన్నారు పురందేశ్వరి. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారని అన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మరోసారి పురందేశ్వరి ఘాటుగా స్పందించారు.