ఆయుధాల అక్రమ కొనుగోలు ఆరోపణలపై తన మీద కేసు నమోదు కాకుండా, అరెస్ట్ చేయకుండా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించి అనీష్ vs బీహార్ స్టేట్ గవర్నమెంట్ కేస్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను పాటించాలని రాష్ట్రప్రభుత్వం కు అదేశం ఇస్తూ తీర్పు వెల్లడించింది.
కేసు నమోదు చేయాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలను పాటించాలన్న హై కోర్టు గైడ్ లైన్స్ ను ప్రభుత్వం పాటించకపోతే కోర్ఠు ధిక్కరణ కిందకు వస్తోందన్నారు. బాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. బాబు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావును కొత్తగా వచ్చిన ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఇజ్రాయిల్ నుండి సెక్యూరిటీ పరికరాల కొనుగోలు విషయంలో నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాలతో ఏబీ వెంకటేశ్వరరావుని విధుల నుండి తప్పించింది.