డ్రగ్స్ ఆరోపణల కారణంగా అరెస్ట్ అయిన రాగిణి, సంజన ప్రస్తుతం బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో జుడీషియల్ కస్టడీలో వున్నారు. పలు కోణాల్లో వీరిపై విచారణ చేస్తున్న ఎన్సీబీకి సంచలన విషయాలు తెలిసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ హీరోయిన్లిద్దరూ కలిసి సెక్స్ రాకెట్‌ని కూడా నడిపించినట్టు సంచలన ఆధారాలు ఎన్సీబీకి లభించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందు కోసం వీరు ఏకంగా ఓ వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్ చేశారట.
డ్రగ్స్ ఆరోపణలు, ఎన్సీబీ సమన్ల విషయం ముందుగానే పసిగట్టిన రాగిణి, సంజన సెక్స్ రాకెట్‌కు సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌ని డిలిట్ చేసినట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించారట. సినీ ఇండస్ట్రీలో ఫెడవుట్ హీరోయిన్ లుగా ముద్రపడి ఎలాంటి అవకాశాలు లేని వీరు కోట్లల్లో ఆస్తుల్ని కూడబెట్టడానికి కారణం చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడమేనని ఎన్సీబీ అధికారులు భావిస్తున్నారట.