కేంద్ర ప్రభుత్వం అందించే స్కీమ్స్ తో చాలా మంది ప్రయోజనాలను పొందుతున్నారు. అభ కార్డు ని కూడా కేంద్రం తీసుకు వచ్చింది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ తో చాలా చక్కటి ప్రయోజనాలని పొందుతున్నారు. ఈ కార్డు ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధి లోకి వచ్చే నేషనల్ హెల్త్ అథారిటీ తీసుకు వచ్చింది. రూ.5 లక్షల ఆరోగ్య బీమాను ఈ కార్డు తో పొందొచ్చు.
ఇది 14 అంకెల సంఖ్య తో వస్తుంది. ఈ 14 అంకెల సంఖ్య మీరు ఎక్కడ వున్నా కూడా మెడికల్ రికార్డులకు యాక్సెస్ చేస్తుంది. ఆరోగ్య రికార్డులను బీమా ప్రోవైడర్లు, ఆస్పత్రులు, క్లినిక్ లకు డిజిటల్ గా షేర్ చేసుకోవచ్చు. అలానే ఇది డాక్యుమెంటేషన్, మెడికల్ రిపోర్టుల సంరక్షణ నుంచి కాపాడుతుంది. ఇది హెల్త్ కండిషన్ తెలుసుకోడానికి వైద్యులకు ఉపయోగపడుతుంది కూడా.
ఈ కార్డు కోసం ఇలా అప్లై చేసుకోండి:
ఈ కార్డు కోసం మొదటిగా https://healthid.ndhm.gov.in/register వెబ్ సైట్ కి వెళ్ళండి.
ఇక్కడ క్రియెట్ అభ నెంబర్ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు డిస్ ప్లే అయిన ఆప్షన్స్ లో యూజింగ్ ఆధార్ పై క్లిక్ చేయాలి.
ఆధార్ ని ఎంటర్ చేసి ‘నేను అంగీకరిస్తున్నాను’ మీద క్లిక్ చేసి దరఖాస్తు చెయ్యాలి.
ఇప్పుడు మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి.
కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది అందులో డిస్ ప్లే అయిన వివరాలు చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఇప్పుడు కొత్త పేజీ వస్తుంది.
ఈ మెయిల్ చిరునామాకు సమానమైన హెల్త్ అకౌంట్ క్రియేట్ అవుతుంది.
మీ ఫోటో తో ఉన్న ABHA కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.