అభినందన్ వర్థమాన్ ఈపేరు తెలియని వారుండరు ఇండియాలో.. పాక్ వైమానికి దాడిని ఎదుర్కొని శత్రువుకు మచ్చెమటలు పట్టించిన ఉదంతం ఎవరూ మరవలేరు. పాక్ సైనికులకు పట్టుబడ్డా చలించని ధైర్యాన్ని ఎవరూ మరిచిపోలేరు. అలాంటి బాలాకోట్ వైమానికి దాడుల హీరో, ఇండియన్ ఏయిర్ ఫోర్స్ ఏస్ పైలెట్ వింగ్ కమాండర్ వర్థమాన్ కు ప్రమోషన్ లభించింది. అభినందన్ వర్థమాన్ ను గ్రూప్ కెప్టెన్ ర్యాంకుకు ప్రమోట్ చేస్తూ ఇండియన్ ఏయిర్ ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ కెప్టెన్, ఆర్మీలో కల్నల్ స్థాయికి సమానం. గతంలో పాక్ వైమానికి దాడిలో తిప్పికొట్టినందుకు అభినందన్ వర్థమాన్ కు వీర్ చక్ర అవార్డు కూడా లభించింది.
2019లో బాలాకోట్ దాడుల అనంతరం పాక్ వైమానికి దళం ఇండియాపై ఎయిర్ అటాక్ కు ప్లాన్ చేశాయి. అయితే పాక్ వైమానిక దాడులను తిప్పికొట్టేందు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ తన మిగ్-21 బైసన్ విమానంతో అత్యాధునికి పాక్ వైమానికి దళానికి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చివేశాడు. అదే సమయంలో తన విమానానికి కూడా ప్రమాదం ఏర్పడటంతో పారాశూట్ సహాయంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ల్యాండ్ అయ్యాడు. ఆ తరువాత అభినందన్ ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇటు ఇండియా నుంచి అటు ప్రపంచదేశాల నుంచి ఒత్తడి రావడంతో పాకిస్థాన్ కు మార్గం లేక అభినందన్ ను విడుదల చేసింది.