T20 WORLD CUP : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘన్‌.. భారీ మార్పులతో బరిలోకి ఇండియా

టీ 20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా ఇవాళ భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం లో జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్‌ నెగ్గిన ఆఫ్ఘనిస్తాన్‌.. మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో మరోసారి టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ఆఫ్ఘనిస్తాన్ ( ప్లేయింగ్ XI ): హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్(w), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ(c), గుల్బాదిన్ నాయబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, రషీద్ ఖాన్, కరీం జనత్, నవీన్-ఉల్-హక్, హమీద్ హసన్

భారత్ (ప్లేయింగ్ XI ): KL రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(c), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా