బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసింఏద. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ ”బాబ్ విశ్వాస్” అనే సినిమా ను చేస్తున్నారు. అయితే… ఈ సినిమా షూటింగ్ సందర్భంలో అభిషేక్ బచ్చన్ తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ సీన్ షూట్ చేస్తున్న నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ కింద పడ్డాడని… దీంతో ఆయన భూజానికి తీవ్రమైన గాయమైందని సమాచారం అందుతోంది.
అయితే.. ఈ ఘటన జరిగిన వెంటనే అభిషేక్ బచ్చన్ ను ముంబై లోని లీలావతి ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే.. అభిషేక్ బచ్చన్ ఆస్పత్రిలో చేరిన సమయంలో చేతికి బ్యాండేజ్ తో కూడిన ఫోటోలు బయటకు వచ్చాయి. గాయపడిన అభిషేక్ బచ్చన్ చికిత్స నిమిత్తం ఆస్పత్రి లో చేరగా.. కొడుకును చూసేందుకు అమితాబ్ బచ్చన్ కూడా ఆస్పత్రి కి వచ్చినట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.