ఏసీబీకి పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్, సోషల్ మీడియా స్టార్

-

మహబూబాబాద్ సబ్ రిజిష్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు.ఈ క్రమంలో మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహమ్మద్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రిజిస్టేషన్ విషయంలో ఒక వ్యక్తి నుంచి రూ.19,200 లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈమె గతంలో ములుగు సబ్ రిజిస్ట్రార్గా పని చేశారు. తస్లిమా Sarwar ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు.

ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లిమా ప్రభుత్వ అధికారిణి అయినా కూలీ పనులు చేస్తూ, పేదల మధ్య తిరుగుతూ, నిరాడంబరంగా ఉన్నట్లు వీడియోలు చేస్తూ ఆమె ఫేమస్ అయ్యారు. లంచం అనే మాట వినిపిస్తే ఆమె భద్రకాళీ అవుతుందనే అభిప్రాయమూ ప్రజలలో ఉంది. ఉత్తమ అధికారిణిగా 13సార్లు అవార్డు అందుకున్నారు. కానీ.. ఇదంతా రీల్ లైఫ్.తాజాగా ఆమె రియల్ లైఫ్ గురించి తెలిసి అందరూ షాక్ కి గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news