తెలంగాణలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పలువురు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తోంది. చిన్న పనులకు కూడా లక్షల్లో లంచం డిమాండ్ చేస్తూ, ప్రజల కష్టార్జితాన్ని పిలిచి పిప్పి చేస్తున్న అవినీతి అనకొండలపై ఏసీబీ కొరడా ఝలిపిస్తోంది.
తాజాగా సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏజెంట్ల ద్వారా సబ్ రిజిస్ట్రర్ సురేందర్ నాయక్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమా చారంతో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు.సబ్ రిజిస్ట్రర్‌తో పాటు ఏజెంట్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు .సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు. ఏజెంట్ నుంచి రూ.99,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.