తెలంగాణాలో పోలీసు అధికారులు అక్రమాస్తుల విషయంలో ఎక్కువగా బయటపడుతున్నారు. లంచాల విషయంలో ఏసీబీ అధికారులు కాస్త సీరియస్ గా ఉన్నారు. తాజాగా కామారెడ్డి సీఐ జగదీష్ అక్రమాల వ్యవహారం బయటకు వచ్చింది. బెట్టింగ్ మాఫియా నుంచి 5 లక్షలు వసూలు చేస్తూ ఆయన దొరికిపోయాడు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో గల ఆక్సిస్ బ్యాంక్ లో జగదీష్ లాకర్ ను ఏసీబీ అధికారులు ఓపెన్ చేసారు.
లాకర్ లో 34.40 లక్షల నగదు, 9.12 లక్షల విలువ చేసే 182.560 గ్రాముల బంగారు నగలు, 15.7 గ్రాముల వెండి నగలు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఐపీఎల్ బెట్టింగ్ ముఠా నుండి 5 లక్షలు డిమాండ్ చేసిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇంట్లో లభించిన ఆధారాల ద్వారా లోతుగా విచారిస్తున్న ఏసీబీ అధికారులు, ఇతర అధికారుల మీద కూడా ఫోకస్ చేసారు.