రాహుల్ గ్రాఫ్ బాగా పెరిగింది … గట్టిగా కృషి చేస్తే అధికారంలోకి రావొచ్చు !

-

తెలంగాణాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఓబీసీ సమావేశంలో పాల్గొని రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ కేసీఆర్ ను ప్రజలు బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ అన్న పెట్టిన వాళ్లకి సున్నం పెట్టె రకమంటూ సెటైర్ వేశాడు హనుమంతరావు. ప్రస్తుతం దేశ రాజకీయాలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గ్రాఫ్ బాగా పెరిగిందని అభిప్రాయపడ్డారు హనుమంతరావు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి రాహుల్ గాంధీ ప్రధానిగా అవుతారని శపధం చేశారు. ఒకవేళ రాహుల్ ప్రధాని కాకుంటే హనుమంతరావు పేరును మార్చుకుంటన్నారు. పాలనలో ఉన్న మోదీ ఎన్నెన్నో బూటకపు ప్రమాణాలు చేసి నేడు దేశ ప్రజలను పిచ్చోళ్లను చేశాడన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో మోదీని ప్రజలే తుక్కు తుక్కుగా ఓడిస్తారని నమ్మకంగా చెప్పారు హనుమంతరావు.

- Advertisement -

ఇంకొంచెం కస్టపడి పనిచేస్తే దేశంలో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...