సింగరేణినీ కాపాడుకోవడం అందరి బాధ్యత: మంత్రి జగదీశ్ రెడ్డి.

-

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బొగ్గు గనుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జగదీశ్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. సింగరేణి కాపాడుకోవడం అందరి బాధ్యత అనీ ఆయన అన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఏమాత్రం సోయి లేదని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.

ఏకాభిప్రాయంతోనే సింగరేణి ప్రైవేటికరణకు ఆ రెండు పార్టీలు తేరలేపాయని తీవ్రంగా ఆరోపించారు.నిన్నటి వరకు వేలం పాటలు కలిసి నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. కానీ కేటీఆర్ హెచ్చరికతో ఈరోజు మాట మార్చడని జగదీష్ రెడ్డి అన్నారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని తెలిపారు.సింగరేణి గనుల వేలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏమిటో చెప్పాలన్నారు.కిషన్ రెడ్డి పదవి తీసుకొని హైదరాబాద్‌లో దిగిన మొదటి రోజే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసే పని చేశాడని జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 5 సంవత్సరాలలో కిషన్ రెడ్డి చేసింది ఏమైన ఉందంటే అక్కడ ఎక్కడో రైల్వే స్టేషన్లో పాత లిఫ్టును బాగు చేసి ప్రారంభించడం అని సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news