శ్రీకాకుళం లో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు కానిస్టేబుళ్లు మృతి

-

శ్రీకాకుళం : ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకు వచ్చినా… రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అతి వేగం… అన్యాయంగా ప్రజల ప్రాణాలు తీస్తోంది. అయితే… తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస ( మం) సున్నాదేవి జంక్షన్ వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటన లో ఏకంగా నలుగురు ఏఆర్ సిబ్బంది మృతి చెందారు. మృతుల్లో ఒక ఏఎస్ఐ , ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ , డ్రైవర్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

మందస లో ఆర్మీ జవాను అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. జీపు ఫ్రంట్ టైర్ పేలడం తో ఈ ఘటన జరిగినట్లు గా తెలుస్తోంది. జీపు ఫ్రంట్ టైర్ పేలడం తో… ఎదురుగా వస్తున్న లారీని ఏఆర్ సిబ్బంది ప్రయాణిస్తున్న జీపు ఢీకొట్టింది. మృతులు కృష్ణుడు ( ఏఎస్ఐ) , ఆంటోని ( హెచ్.సీ) , బాబూ రావు ( హెచ్.సీ) , జనార్ధన్ ( డ్రైవర్ ) ఉన్నట్లు గుర్తించారు. అయితే… ఈ ప్రమాదం ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version