అఫ్ఘానిస్తాన్‌లో రాజ్యంగ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. తాలిబన్ల భయానికి చాలా మంది ప్రజలు ఆ దేశాన్ని వదిలేసి.. ఇతర దేశాలకు తరలిపోతున్నారు. అయితే.. గత వారంలో ఆప్ఘాన్ కంట్రీ తాలిబన్ల నియంత్రణ లోకి వెళ్ళిపోవడంతో ఆ దేశ క్రికెట్ నియంత్రణ పైన పలు అనుమానాలు నెలకొన్నాయి. అయితే.. ఎవరూ ఊహించిన విధంగా తాలిబన్లు ఆఫ్గాన్ క్రికెట్ కు మద్దతు పలికారు.
తాజాగా తాలిబన్ నాయకుడు అనీస్ హక్కానీ ఆప్ఘానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షామిది, మాజీ క్రికెట్ బోర్డు అధికారులు అసదుల్లా, నూర్ అలీ జద్రాన్ లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. దీంతో యూఏఈ వేదికగా త్వరలో జరగబోయే టీ 20 ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు అఫ్గాన్ కు లైన్ క్లియర్ అయినట్లేనని సమాచారం అందుతోంది. కాగా.. 1996 నుంచి 2001 మధ్యలో హక్కాని అధ్యక్షతనే అఫ్ఘాన్ లో క్రికెట్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.