జగన్ అసమర్ధ పాలనలో విద్యారంగం బ్రష్టుపట్టిందని మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు వాయిదాలకు అలవాటు పడి పడి.. పరీక్ష ఫలితాలు వాయిదా వేస్తే ఎలా జగన్..? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదవ తరగతి పరీక్షా ఫలితాల వాయిదా పై విద్యార్థులకు సమాధానం చెప్పండి అని, ఇవాళే ఫలితాలు వస్తాయని ఆరు లక్షల మంది విద్యార్థులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు.
ముందుగానే పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి చివరి నిమిషంలో వాయిదా వేయడం ఏమిటి? ఫలితాల వాయిదా అధికారులు, మంత్రి మధ్య సమన్వయ లోపమా? లేక జగన్ ప్రభుత్వ చేతగానితనమా? అంటూ ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసమర్థ పాలనతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తిని.. జగన్ విద్యాశాఖ మంత్రిని చేశారని ఆయన మండిపడ్డారు.