ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్ లో న్యూజిలాండ్-భారత్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్ 3 కీలక వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ 2 కీలక వికెట్లు తీశాడు. రచిన్ రవీంద్ర, విలియమ్సన్ వికెట్లను తీసి స్కోరుని కట్టడి చేశాడు. మహ్మద్ షమీ వింగ్ వికెట్ తీశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 75 పరుగుల వద్ద 3 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లకు న్యూజిలాండ్ 83 పరుగులు చేసింది.
టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బౌలింగ్ చేస్తుంది. గత మ్యాచ్ లో న్యూజిలాండ్ తో ఆడిన టీమ్ నే కొనసాగిస్తోంది. తొలుత న్యూజిలాండ్ బ్యాటర్లు స్కోరును పరుగెత్తించారు. ఆ తరువాత మెల్లగా వికెట్లు పోవడంతో రన్ రేట్ తగ్గుతూ వస్తోంది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇవాళ అద్భుతమైన బౌలింగ్ చేస్తూ న్యూజిలాండ్ పతనాన్ని ప్రారంభించాడు. మరోవైపు రవీంద్ర జడేజా, వరుణ్ తేజ్ కూడా రంగంలోకి దిగితే న్యూజిలాండ్ తక్కువ స్కోరుకే కట్టడి చేసే అవకాశం కనిపిస్తోంది.