12 న యువత పోరుతో ప్రభుత్వాన్ని నిలదీద్దాం : సజ్జల

-

రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సజ్జల తెలిపారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వైసీపీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు అని మండిపడ్డారు. మొత్తం రూ.3900 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్ లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గం.. విద్యార్థుల సంఖ్యను కూడా కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

పేద, మధ్యతరగతి విద్యార్థులను చదువులకు దూరం చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్ధులను వెళ్ళగొడుతున్నారు.. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కారు చోద్యం చూస్తోంది అని సజ్జల అన్నారు. కూటమి ప్రభుత్వంపై యువతలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు విస్మరించారు.. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెలా మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తానంటూ ఇచ్చిన హామీ ఏమయ్యింది?.. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7200 కోట్లు అవసరం.. కానీ, గత బడ్జెట్ లో దీనికి కేటాయింపులు లేవు అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version