హీలియోస్‌, ట్రైటాన్ సిరీస్‌లో ఏస‌ర్ నుంచి కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌లు

కంప్యూట‌ర్ ఉత్ప‌త్తుల త‌యారీదారు ఏస‌ర్ నూత‌నంగా హీలియోస్‌, ట్రైటాన్ సిరీస్‌లో ప్రిడేట‌ర్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. హీలియోస్ 300, ట్రైటాన్ 300 పేరిట ఆ ల్యాప్‌టాప్‌లు విడుద‌లయ్యాయి. వీటిల్లో ఇంటెల్ 10వ జ‌న‌రేష‌న్ ప్రాసెస‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఎన్‌వీడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 2020 సిరీస్ గ్రాఫిక్ కార్డుల‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల గేమింగ్‌తోపాటు గ్రాఫిక్స్ ప‌నుల‌కూ ఈ ల్యాప్‌టాప్‌లు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Acer Predator Helios 300 and Triton 300 gaming laptops launched in India

ఈ ల్యాప్ టాప్‌ల‌లో 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేల‌ను ఏర్పాటు చేశారు. వీటిల్లో 32 జీబీ వ‌ర‌కు ర్యామ్‌ను అమ‌ర్చుకోవ‌చ్చు. 2 ఎస్ఎస్‌డీల‌ను, 2టీబీ వ‌ర‌కు హార్డ్ డిస్క్‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. వీటిల్లో కూలింగ్ కోసం ప్ర‌త్యేక ఫ్యాన్ల‌ను ఏర్పాటు చేశారు. అలాగే డీటీఎస్ ఎక్స్ అల్ట్రా ఆడియో వీటిల్లో ల‌భిస్తోంది.

ఏస‌ర్ ప్రిడేట‌ర్ హీలియోస్ 300 గేమింగ్ ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధ‌ర రూ.84,999 ఉండ‌గా, ప్రిడేట‌ర్ ట్రైటాన్ 300 గేమింగ్ ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధ‌ర రూ.89,999గా ఉంది. వీటిని ఏస‌ర్ ఇ-స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, క్రోమా, రిల‌య‌న్స్ డిజిట‌ల్ స్టోర్‌లలో విక్ర‌యిస్తున్నారు.