Acharya: అఫీషియల్: మెగా అభిమానులకు గుడ్ న్యూస్..‘ఆచార్య’ ట్రైలర్ రిలీజ్ డేట్ రివీల్‌డ్

-

మెగా అభిమానులకు ‘ఆచార్య’ ఫిల్మ్ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ‘ఆచార్య’ చిత్ర ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తుండగా, ట్విట్టర్ వేదికగా ఈ నెల 12న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. కొద్ది రోజుల నుంచి ఈ పిక్చర్ ట్రైలర్ విషయమై రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ ఫైనల్ గా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ నటించింది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు. ఆయనకు జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

రెజీనా కసాండ్ర ఇందులో ‘చానా కష్టం’ అనే స్పెషల్ సాంగ్ చేసింది. భారీ తారగణం ఉన్న ఈ చిత్రంలో మావోయిస్టులుగా రామ్ చరణ్, చిరంజీవి నటించినట్లు ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ద్వారా స్పష్టమవుతోంది. ‘ధర్మస్థలి’ అనే దేవాలయంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా ‘ఆచార్య’గా చిరంజీవి పాత్ర వీరోచితంగా ఉండబోతున్నదని తెలుస్తోంది. ఈ నెల 29న చిత్రం విడుదల కానుంది. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత విడుదలవుతున్న మెగాస్టార్ ఈ చిత్రం కోసం అభిమానులు వేచి చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news