టిఆర్ఎస్ సర్కార్ ది.. శిశుపాలుడి పాలన – ఈటెల రాజేందర్..

-

మహబూబ్ నగర్ జిల్లా కిసాన్ మోర్చా రైతు సదస్సులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నాను. తెలంగాణ సాధన ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లా జైలుకు వెళ్లాను.టీఆర్ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలాగ వంద తప్పులు చేసింది. ప్రజలు టీఆర్ఎస్ ను శిక్షించి నన్ను గెలిపించారు. 101వ తప్పుకు ప్రజలు శిక్షిస్తారు అని అన్నారు  ఈటల రాజేందర్.ప్రజాప్రతినిధులు ప్రజల డబ్బుకు, సంపదకు కాపలాదారులు మాత్రమే. ప్రధాని నరేంద్ర మోడీ హూందాగా అది తన కర్తవ్యమని చెబుతారు. కేసీఆర్ గారు నేనిచ్చానని చెప్పుతారు.

గజ్వేల్ లోని ఆయన సొంత భూములు అమ్మి ఇస్తున్నారా?..కేసీఆర్ తప్పులు చేస్తూ రైతులను వెంటాడుతున్నారు. బాధ్యతతో మాట్లాడుతున్నాను. ఒక సందర్భంలో కేసీఆర్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని మాకు చెప్పారు. ఒక రాష్ట్రంలో ఒక అవసరం ఉంటుంది.నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అన్నారు కదా? వ్యవసాయమే గ్రామీణ ఆర్థిక జీవనం. కంప్యూటర్ యుగంలో అన్నం పెట్టేది భూతల్లి మాత్రమే. అలాంటి వ్యవస్థను కాపాడాల్సింది పోయి వరి వేస్తే ఉరి అని స్వయానా సీఎం కేసీఆర్ చెప్పడం భావ్వమా?అని ప్రశ్నించారు ఈటెల రాజేందర్.ప్రతిపక్షాలకు ప్రజల తరఫున కొట్లాడే బాధ్యత ఉంటుంది. ప్రజలు అధికారం ఇస్తే కుర్చీపైనుండి వెలకిలపడి ధర్నాలు చేస్తున్నారు.ప్రజల సమ్యలు పరిష్కరించకపోతే కుర్చీపై కూర్చునే అధికారం లేదు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news