చరణ్ పాత్ర చాలా అంటే చాలా బాగుంది. ఆ విధంగా ఈ సినిమాకు ఆయనే హైలెట్. ఇదీ మెగా అభిమాని మాట ! అన్నయ్య జీవం పోశాడు.. ఇక పై కూడా ఇలానే అలరించాలి.. డ్యాన్సులలో ఈజ్ తగ్గలేదు.. క్రేజ్ తగ్గలేదు.. అని అంటున్న మాట ! పై రెండు మాటలను కలిపితే.. లేదా పై వాక్యాలను కలిపి చూస్తే సినిమా రేంజ్ ఏంటన్నది అంచనా వేయవచ్చు. ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర నిడివి పెంచినా లేదా అభినయం పరంగా ఇంకాస్త ఆమెను తీర్చిదిద్దినా మరో మెట్టు ఎక్కేదే ! ఆ విధంగా అందాల పూజ పెద్దగా ఆకట్టుకోకపోవడం నిరాశ. మెగా మానియా వెంటే ఉన్నా కూడా మెస్మరైజ్ చేయలేకపోవడం ఇంకా నిరాశ. శ్రీమంతుడు సినిమాలో శ్రుతి హసన్ నడిపే కథ ఎంతో హృద్యంగా ఉంటుంది. అందులో కూడా ఆమెకు ఓ బాధ్యత ఉంటుంది.
మరి! ఈ సినిమాలో గ్రామీణ యువతిగా కనిపించిన పూజా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందన్న వాదన ఒకటి వస్తోంది. క్యారెక్టర్ పరంగా ఆమె ఒకే కానీ.. ఈ సినిమా ఆమె కెరియర్ ఎంత మాత్రమూ ప్లస్ కాదు. ఓ విధంగా ఆమె లేకపోయినా పర్లేదు లాగించేయొచ్చు అని చెప్పలేం కానీ.. ఓ విధంగా ఆమె ఆడియెన్ కు రిలీఫ్ పాయింట్.
..ఇక ఈ సినిమాలోని
ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే..
- మహేశ్ బాబు వాయిస్ ఓవర్
- రామ్ చరణ్ పాత్రను డైరెక్టర్ స్టైలిష్ గా చూపించారు..
- పూజాహెగ్డే స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది..
- లాహె లాహె సాంగ్ లో చిరంజీవి డ్యాన్స్ హైలెట్ ..
- సాంగ్స్, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మంచి బజ్ ను తీసుకు వచ్చాయి..
- పోరాట సన్నివేశాలలో తండ్రి, కొడుకులు పోటీపడి మరీ! చేయడం సినిమాకు మరో ప్లస్..
మరో అట్రాక్షన్ కూడా !
ఏదేమయినప్పటికీ ఆచార్య సినిమా పండుగ మొదలయింది. మాస్ జాతర మొదలయింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ను ఒకే స్క్రీన్ మీద ఒకే సినిమాలో ఎక్కువ నిడివి ఉన్న పాత్రలలో చూడాలని అనుకున్న వారి ఆశ నెరవేరింది. ఆ విధంగా ఆ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. మొదట్నుంచి ఈ సినిమా తీసుకువచ్చిన హైప్ కు అనుగుణంగానే రిజల్ట్ కూడా ఉండాలని, ఉంటుందని కూడా ఆశిద్దాం. హై ఎండ్ యాక్షన్ సన్నివేశాలే ఈ కథకు అడ్డం వస్తున్నాయి అని తెలుస్తోంది.
ఇదొక్కటే ఈ సినిమాకు మైనస్. గతం కన్నా కొరటాల మార్కు తగ్గింది. ఆయన డైలాగ్ మాత్రం బాగున్నా, ఈ సినిమాలో ఇద్దరి మానియాతో ఓ వండర్ సృష్టించడం మాత్రం ఆయనకు సాధ్యం కాలేదు అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఇదొక్కటీ మినహాయిస్తే ఈ సినిమా మిగిలిన అన్ని విషయాల్లోనూ బాగుంది. ఏదేమయినప్పటికీ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని మొదటి నుంచి చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కథ పరంగా కొన్ని తప్పిదాలు ఉన్నా ఓ వైపు చిరంజీవి, రామ్‌చరణ్‌ల మాస్ ఇమేజ్‌ను క్యారీ చేస్తూనే మరోవైపు, తనదైన శైలిలో సందేశాత్మక కథతో ప్రేక్షకులకు తమ పరిధిలో తమకు తెలిసిన యాక్టింగ్ స్కిల్స్ తో చిరు చెప్పిన విధంగా కథకు అనుగుణంగా తన పాత్రకు అనుగుణంగా కొద్దిపాటి మేనరిజమ్స్ తో ఎప్పటిలానే మెగాస్టార్ మెస్మరైజ్ చేశారన్నది సుస్పష్టం.