Acharya: ‘ఆచార్య’ అసలు కథ ఇదే..మెగా అభిమానులకు పండుగే

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైంది. విశేష ఆదరణ పొందుతున్న ఈ ట్రైలర్ చూసి మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా స్టోరి గురించి సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. తండ్రీ తనయులు చిరంజీవి – రామ్ చరణ్ లను వెండితెరపైన అత్యద్భుతంగా దర్శకులు కొరటాల శివ ఆవిష్కరించారని ప్రశంసిస్తున్నారు.

‘ఆచార్య’ ట్రైలర్ ఆధారంగా స్టోరి ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం కూడా జరుగుతోంది. దాని ప్రకారం..‘ఆచార్య’ పిక్చర్ లో ‘ధర్మస్థలి’అనే పుణ్యక్షేత్రం చుట్టు తిరిగే కథగా ముందుకు సాగుతున్నదని స్పష్టమవుతోంది. ఇక్కడ పచ్చటి అడవుల్లో కొలువైన అమ్మవారు ఘట్టమ్మను ప్రజలకు కొలుస్తారు. అటువంటి ధర్మస్థలి, పాదఘట్టానికి రక్షకుడిగా ‘సిద్ధ’ అలియాస్ రామ్ చరణ్ ఉంటారు.

ధర్మస్థలికి ఆపద వచ్చినపుడు అనుకోని పరిస్థితులలో అక్కడి నుంచి ‘సిద్ధ’ వెళ్లిపోవడం..‘ఆచార్య’ను కలిసి తర్వాత రంగ ప్రవేశం చేసి అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడే కామ్రేడ్స్ ‌గా ‘సిద్ధాచార్యులు’గా రామ్ చరణ్ , చిరంజీవి కనిపిస్తారని అంటున్నారు.

స్టోరిలో ఎవరూ ఊహించని ట్విస్టులను కొరటాల శివ ప్లాన్ చేశారని టాక్. విలన్ రోల్ ప్లే చేసిన రియల్ హీరో సోనుసూద్ పాత్రను కూడా చాలా చక్కగా ఆవిష్కరించారట. చూడాలి మరి..ఈ సినమా అసలు స్టోరి ఏంటనేది తెలియాలంటే ఈ నెల 29న విడుదల కానున్న సినిమాను చూడాల్సిందే..

Read more RELATED
Recommended to you

Exit mobile version