లోకేష్ పాదయాత్రకి ముందే దాడులకు పథకం సిద్ధం చేశావా జగన్ రెడ్డి? – అచ్చెన్నాయుడు

-

టిడిపి జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ ఈనెల 27 నుండి యువగలం పేరుతో పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్లు రాష్ట్రంలో పర్యటించేలా కార్యాచరణ రూపొందించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు రోజులపాటు, ఉమ్మడి జిల్లాల ప్రాతిపాదికన ప్రతి జిల్లాలో నెలరోజుల పాటు ఈ పాదయాత్ర సాగనుంది.

చిత్తూరు జిల్లా నుంచి అనంతపురం, కర్నూలు, కడపల మీదుగా రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసి నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా కోస్తా జిల్లాల్లోకి యువగలం పాదయాత్ర ప్రవేశిస్తుంది. ఈనెల 26వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాత్రికి కుప్పం చేరుకుంటారు నారా లోకేష్. అయితే నారా లోకేష్ పాదయాత్ర ని అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు టిడిపి నేత అచ్చెన్నాయుడు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ పై మండిపడ్డారు.

‘ నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందే దాడులకు పథకం సిద్ధం చేశావా జగన్ రెడ్డి? శాంతిపురం ఎంపీపీ, వైసీపీకి చెందిన కోదండ రెడ్డి కుప్పం నియోజకవర్గ వాట్సాప్ గ్రూప్ లలో హింసను ప్రేరేపించే విధంగా, పాదయాత్ర పై దాడులు చేయండి అంటూ పబ్లిక్ గా మెసేజ్ లు పంపేస్తాయికి బరితెగించాడు అంటే దీని వెనుక కచ్చితంగా నీ హస్తం, మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉన్నట్లే అనుకోవాలా? రాష్ట్ర పోలీసు యంత్రాంగం దీనిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూస్తాం ” అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version