బాబు-లోకేష్‌కు ప్రాణహాని..పాదయాత్ర ఆపితే..!

-

గత రెండు, మూడు రోజులుగా లోకేష్ పాదయాత్రపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. జనవరి 27 నుంచి కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. ఇక ఈ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లని టీడీపీ శ్రేణులు చూసుకుంటున్నాయి. అలాగే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లని చేస్తున్నారు. ఏర్పాట్లు అయితే చేస్తున్నారు గాని, ఇంతవరకు పాదయాత్రకు పర్మిషన్ మాత్రం రాలేదు. ఇప్పటికే టీడీపీ నేత వర్ల రామయ్య..డి‌జి‌పికి, చిత్తూరు ఎస్పీకి, కుప్పం పోలీసులకు అనుమతి కోసం లేఖలు రాశారు.

కానీ ఇంతవరకు పోలీసుల నుంచి ఎలాంటి రిప్లై లేదని చెప్పి..వర్ల మరోసారి లేఖ రాశారు. అయితే పాదయాత్రకు సంబంధించిన సమాచారం వచ్చింది గాని..పాదయాత్ర అనుమతి కోసం లేఖ రాలేదని కుప్పం పోలీసులు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో లోకేష్ పాదయాత్రపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇదే సమయంలో పాదయాత్రకు అనుమతి ఇంకా ఇవ్వకపోవడంపై టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర అడ్డుకోవడానికి జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారని, చంద్రబాబుకి, లోకేష్‌కి ప్రాణ హాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాదయాత్రకు సంబంధించి డీజీపీకి ఎప్పుడో అప్లై చేశామని.. ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదని, అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని.. దానిని ఆపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం లోకేష్ పాదయాత్రకు ప్రత్యేక బలగాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీఓ నంబర్ 1ని ఉపసంహరించుకోవాలని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాజాగా అయ్యన్నపాతుడు..గంటా శ్రీనివాసరావుపై చేసిన వ్యాఖ్యలకు బుద్దా వివరణ ఇచ్చారు. టీడీపీలో ఎవరూ ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదని, గంటా శ్రీనివాసరావును అయ్యన్న ఎక్కడా అగౌరపరిచే విధంగా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version