విజయవాడ తూర్పు నియోజకవర్గ తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఏపీ టీడీపీ అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ దొంగని తెలిసి కూడా ఓట్లు వేసినందుకే ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు. మా హయాంలో అభివృద్ధి-సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రజలపై ఎలాంటి పన్ను వేయలేదన్న ఆయన ముఖ్యమంత్రి చేతకాని దద్దమ్మ కాబట్టే సంపద సృష్టించటం చేతకాక ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టారని అన్నారు. జుట్టు మీద తప్ప అన్నింటిపైనా ప్రజలపై పన్నుల భారం మోపారని ఆయన ఎద్దేవా చేసారు.
ఏలూరు వింత వ్యాధి ఘటనకు ఇంతవరకు మూలాలు కూడా చెప్పలేని ముఖ్యమంత్రి అసమర్ధత ప్రజలకు అర్ధం అవుతోందని అన్నారు. ఎన్నికలకు కరోనా కారణం అని చెప్తున్న సీఎం నిన్న వేలాదిమంది తో ఎందుకు సభ నిర్వహించారు ? అని అయన ప్రశ్నించారు. జగన్ మంత్రివర్గంలో కొందరు మంత్రులు కుక్కలకంటే హీనంగా బతుకుతున్నారన్న అచెన్న తప్పు చేసే ప్రతి ఒక్కరి చిట్టా రాస్తున్నాం,మళ్లీ అధికారంలోకి రాగానే ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని అన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్న వార్నింగ్ ఇచ్చారు. అవసరాల కోసం పార్టీలు మరేవారికి ఈసారి తెలుగుదేశం లో చోటు ఉండదని ఆయన అన్నారు.