డేటింగ్ యాప్ లో నగ్నంగా వీడియో కాల్.. చివరికి ఏం జరిగిందో తెలుసా..?

-

టెక్నాలజీ పెరగడం ఏమో కానీ టెక్నాలజీ ద్వారా పెరిగిపోతున్న సమస్యలు మాత్రం రోజురోజుకూ ఎక్కువవుతోన్నాయి. ఆధునిక టెక్నాలజీ అలవాటుపడుతున్న నేటి యువత సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ పుణ్యమా అని ఎంతో మంది యువత ఎన్నో రకాల చిక్కుల్లో పడి సతమతమవుతున్నారు అన్న విషయం తెలిసిందే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డేటింగ్ యాప్స్ పేరుతో యువతను ఆకర్షించేందుకు ఎన్నోరకాల యాప్స్ తెరమీదకు వచ్చాయి. ఇక ఈ డేటింగ్ యాప్స్ ఎంతోమంది కొంప ముంచుతున్నాయి అనే చెప్పాలి.

ఇటీవలే డేటింగ్ యాప్ ద్వారా ఎంతగానో ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఓ టెకీకి పెద్ద సమస్య వచ్చి పడింది. ఏకంగా అమ్మాయిలు సదరు టెక్కీని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు ఏకంగా 16లక్షల వరకు అతని వద్ద దోచేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని సదరు టేకి పోలీసులను ఆశ్రయించి విషయం తెలిపాడు కర్నాటకలోని బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. బెంగుళూరుకు చెందిన ఓ టెకీ డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలతో చాటింగ్ చేయాలి అనుకున్నాడు ఈ క్రమంలోనే శ్వేతా అనే యువతి పరిచయం కాగా ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే ఓ సారి తనకు 2000 అవసరం ఉన్నాయని పంపాలి అంటూ శ్వేతా కోరడంతో వెనకా ముందు ఆలోచించకుండా పంపాడు. ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ నికిత నెంబర్కి పంపాలి అంటూ శ్వేతా కోరింది ఇక ఆ తర్వాత తెర మీదికి వచ్చిన నిఖిత టెక్కిని నగ్నంగా వీడియో కాల్ చేయాలి అంటూ కోరింది దీంతో టేకి ఎంతో సంబరపడిపోయి వీడియో కాల్ చేసాడు కానీ ఆ తర్వాత అడ్డంగా బుక్కయ్యాడు. ఆ వీడియోని రికార్డ్ చేసి టెక్కీని బెదిరింపులకు పాల్పడటం మొదలుపెట్టారు ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు యువతులు అసలు పేరు ప్రీతి అగర్వాల్, షారైన్. అడిగినంత డబ్బులు చెల్లించకపోతే వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ బెదిరించి… అతడి వద్ద నుంచి 16 లక్షలు దోచేశారు విసిగిపోయిన టెకీ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news