నదిలో కనపించకుండా పోయిన నటి…!

-

నదిలో బోటింగ్ కి వెళ్ళిన నటి మిస్సయిన సంఘటన అమెరికా లో చోటుచేసుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం కు సంబంధించిన ఓ నదిలో నటి నయా రివేరా, అతని కుమారుడు బోట్ తీసుకొని విహారానికి వెళ్లారు. ఈ విహార యాత్రలో నటి నయా రివేరా తన కుమారుడు జోషిని వెంటబెట్టుకొని వెళ్ళింది. అయితే బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ బోటును తల్లి కొడుకు అద్దెకు తీసుకుని నదిలోకి విహార యాత్రకు వెళ్లారు.

rivera
rivera

ఇక ఆ తర్వాత రెండు గంటల సమయం తర్వాత లైఫ్ జాకెట్ వేసుకొని ఉన్న ఆమె కుమారుడిని మరో వ్యక్తి బోట్ రైడింగ్ కి రావడంతో అతను గమనించి ఆ అబ్బాయిని కాపాడాలి. అయితే ఈ ఘటనలో ఆ అబ్బాయికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే సదరు వ్యక్తి చుట్టుపక్కల చాలా సేపు వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో నది ఒడ్డుకు వచ్చి అధికారులకు తెలియజేయగా వారు నటి కోసం హెలికాప్టర్లు, డ్రోన్స్  సహాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ పెద్దఎత్తున ప్రారంభించారు అధికారులు. నటి రివేరా కొన్ని టీవీ షోలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news