బిగ్‌బాస్ సీజన్ 4 మరి కొన్ని రోజుల్లో మొదలవబోతుంది. ఈమేరకు ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇప్పటికే బిగ్‌బాస్ కంటెస్టంట్స్‌ని క్వారంటైన్‌లో ఉంచారు. ఇక బిగ్‌బాస్‌లోకి ఎవరు వెళ్ళేది షోలో అనౌన్స్ చేసే వరకు తెలియదు. కంటెస్టంట్స్ ఎవ్వరు కూడా చెప్పకూడదనేది నిబంధన. అయితే సింగర్ గీతా మాధురి భర్త నందు మాత్రం బాగా తొందర పడ్డాడు. తను బిగ్‌బాస్‌కి వెళ్తున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. సపోర్ట్ చెయ్యాలంటూ కోరాడు. అయితే ఇది బిగ్‌బాస్ నిబందనలకు విరుద్ధం.. నిబంధనలు ఉల్లంఘించినందుకు బిగ్‌బాస్ షో నిర్వాహకులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్నది తెలియాలి.
అయితే ఈ విషయంపై బిగ్‌బాస్ షో నిర్వాహకులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. నిబంధనల ప్రకారం షో గురించి కానీ షోలో పార్టిసిపేషన్ గురించి గానీ రహస్యంగా ఉంచాలి. బిగ్‌బాస్ సీజన్ 2లో పాల్గొన్నది ఆమెకు షో నిబంధనల గురించి తెలియంది కాదు.. అలాగే నిబంధనలను కంటెస్టంట్స్‌కి ముందే వివరిస్తారు మరి అలా ఎలా చేశాడనేది ప్రశ్న. ఇప్పడు సీరియస్ గా యాక్షన్ తీసుకోకపోతే బిగ్‌బాస్ నిబంధనలకు విలువ లేకుండా పోతుందనేది షో నిర్వాహకుల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తుంది. తొందరపడి ముందుగానే లీక్ చేసినందుకు నందుని షో నుండి తప్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.